Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చూడుము గెత్సెమనె తోటలో నా ప్రభువు
పాపినాకై విజ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది ll2|l llచూడుll
1 వ చరణం..
దేహమంతయు నలిగి ` శోకము చెందిన వాడై ||2||
దేవాది దేవుని ఏక సుతుడు పడు వేదనలు నా కొరకే ll2|l llచూడుll
2 వ చరణం..
తండ్రియీ పాత్ర తొలగున్ ` నీ చిత్తమైన యెడల ||2||
ఎట్లైయినను నే చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను ll2|l llచూడుll
3 వ చరణం..
రక్తపు చెమట వలన ` మిక్కిలి బాధనొంది ||2||
రక్షకుడేసు హృదయము పగులగ విజ్ఞాపనమే చేసెనుll2|l llచూడుll
4 వ చరణం..
ముమ్మారు భూమిమీద పడి మిక్కిలి వేదనచే
మన యేసు ప్రభువు తానే వేడుకొనెను
పాపుల విమోచన కొరకే ll2|l llచూడుll