Type Here to Get Search Results !

చూడుము ఈ క్షణమే ( chudumu ee kshyaname Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


చూడుము ఈ క్షణమే కల్వరిని 

ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను

గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు 

సిలువలో వ్రేలాడుచున్నాడుగా ||2||


1 వ చరణం.. 

మానవులెంతో చెడిపోయిరి -

మరణించెదమని తలపోయక ||2||

ఎరుగరు మరణము నిక్కమని 

నరకమున్నదని వారెరుగరు llచూడుll 


2 వ చరణం.. 

ఇహమందు నీకు కలవన్నియు -

చనిపోవు సమయాన వెంటరావు ||2||

చనిపోయినను నీవు లేచెదవు

తీర్పున్నదని ఎరుగు ఒక దినమున llచూడుll 


3 వ చరణం.. 

మనలను దనవంతులగ చేయను -

దరిద్రుడాయెను మన ప్రభువు ||2||

రక్తము కార్చెను పాపులకై 

అంగీకరించుము శ్రీయేసుని llచూడుll 


4 వ చరణం.. 

సిలువపై చూడుము, ఆ యేసుని -

ఆ ప్రేమకై నీవు యేమిత్తువు ||2||

అర్పించుకో నీదు జీవితము 

ఆయన కొరకై జీవించుము llచూడుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section