Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: పవిత్రాత్మ స్వరం
ప: చుక్కల్లో - చంద్రుడిలా ,
చిన్నారి - బాలయేసు
భూలోక రారాజుగా
అవతరించే మనకోసమే ||2||
రండి రారండి
ఆరాధించి అనుసరింప ||2|| ||చు||
1. దావీదు గోత్రమందు
బెత్లహేము నగరమందు
మరియమ్మ గర్భమందు
జన్మించే మహారాజుగా ||2||
చీకటి తొలగించి
వెలుగును ఇవ్వుటకు
అర్ధరాత్రమున ఉదయించే
మనకోసమే ||రండి|| ||చు||
2. దివిలో దూతలంతా
పాడిరి గ్లోరియను
భువిలో మనుజులకు
శాంతి సమాధానము ||2||
గొఱ్ఱెల కాపరులు
అర్పించిరి కానుకలను
తెలిపిరి శుభవార్తను
ముదముతో ఎల్లరకు ||చు||