Lyrics: పా.పిల్లి అంతో నిదాస్
Tune: Fr.. Gnanam SDB
Music: NAveen M
Album: ప్రణతులు -9
సనిపమగమ నిపమగసగ పమగసనిని సా చేరితీ
సర్వోన్నతా నీదుసన్నిధి వేడితీ మహోన్నతా నీదు పెన్నిధి ఓతండ్రీ!
నా అర్పణ ఆదరింపుము ఆదరించి నీజీవం అనుగ్రహింపుము ||2||
1) మట్టిపాత్రను పోలిన హృదయం ఒట్టిపాత్రగా మిగిలెను ఫలితం ||2||
నారుపోసి చెంత చేర్చుము నీరుపోసి చింత తీర్చుము ||2||
ఓతండ్రీ! నాపాత్రను స్వీకరింపుము స్వీకరించి నీ రూపం ప్రసాదింపుము ||2||
2) అప్పరసములు నీ బహుమానం అమిత ప్రేమకు అవి కొలమానం ||2||
ఆశతోడ ప్రోగుచేసెద ఆత్మతోడ నీకుచేర్చెద
ఓ తండ్రీ! నాకానుక స్వీకరింపుము . స్వీకరించి నీచిత్తం బోధింపుము ॥2॥