Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి -3
చిగురించిన ఆశలతో వికసించిన మనస్సులతో
వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి
1. చీకటిలో చిరుదీపము - వేదనలో మనస్వాంతము
దివ్యమైన స్నేహము - శాంతినిచ్చు దైవము
2. శోధనలో మన ధైర్యము - శోకములో ఆధారము
నిత్యమైన బంధము - సేద తీర్చు దైవము
3. ఇలలో వెలసిన సత్యము - మానవాళికి మార్గము
విశ్వసించు వారిని - ఆదరించు దైవము