Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చిమ్మచీకటి కమ్ముకొన్నది నా కంటిలో
తండ్రీ! నీ యింటి నుండి వెడలి నప్పుడే
కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో
నీ కంటికి బహు దూరమైనప్పుడే
ఏసయ్యా నా తండ్రివయ్యా నీ వాడిని నీ చిన్నోడిని
1. మోయలేని కష్టాలతో కడవలి కన్నీళ్ళతో
సతమతమై సొమ్మసిల్లి పోయాను నా తండ్రి - ||2|| నీ ప్రేమ నెరిగి కనువిప్పు కలిగి
మారు మనస్సు కలిగి తిరిగి వచ్చానే నీ దుడుకు కొడుకునే
ఏసయ్యా నా తండ్రివయ్యా నీ వాడిని నీ చిన్నోడిని
2. శరీరమును అనుసరించి జీవించిన వాడినే
ఆత్మైక జీవితమును నేర్పించు నా తండ్రి -||2|| నిను వీడనయ్యా ఏ నాటికైనా
నీ ఎదపై ఒదిగి ఒదిగి కను మూయనా నాకెంత భాగ్యము
ఏసయ్యా నా తండ్రివయ్యా నీ వాడిని నీ చిన్నోడిని