Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
చిన్నారి యేసయ్యా.... రావయ్యా...
(మా మంచి యేసయ్యా... రావయ్యా....)
ఈ పాపికి నూతన జన్మను ఇవుమయా ||2||
నా అంతరంగమే - నీదయ్యా ||2||
ఈ బ్రతుకే నీకంకితమయ్యా ||2|| ||చిన్నా||
1. ఆశల ఊసుల ఊహలలో
దారి తప్పి నే తిరిగాను ||2||
పాపపు బ్రతుకుకు బానిసనై
నీదు ప్రేమ నే మరిచాను ||2||
కరుణామయుడా - కనికరించుమా ||2||
తండ్రివై నన్ను స్వీకరించుమా ||2|| ||చిన్నా||
2. తీరని ప్రశ్నల వేదనలో
జవాబు తెలియక తిరిగాను ||2||
లోకం పోకడ లోతులలో
గమ్యం నీవని మరిచాను ||2||
వేదన బాపే మోదం నీవై ||2||
అవతరించుమో-ఆత్మస్వరూపి ||2|| ||చిన్నా||