Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా
మీ మాటలు తేనెల చినుకులు
మీ మనసులువెన్నెల పులకలు
రండీ రారండీ నా బడిలో చేరండి ||2||
1. కన్నవారు చూపించిన వారిని కన్నుల
కద్దుకొని ఎప్పటికప్పుడు
తెలియక చేసే త్తప్పులు దిద్దుకొని
సత్య పథంలో సాగండీ
సహనగుణం సాధించండీ ||ర||
నాయదలో నిలవండీ ||చి||
2. ద్వేషం చెందే అజ్ఞానులపై
ప్రేమను చిలికించే కత్తులు విసిరే
కలుషాత్ములపై కరుణను కురిపించే
దేవుని దీవెనలందండీ దివినే
భువిపై ఏతెంచండీ రండీ రారండీ ||2||
నా జతగా నడవండి ||2||
మీరందించిన ఈ ఉపదేశం
మానవజాతిని తరియింప జేసే
శాంతి సందేశం, శాంతి సందేశం