Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
క్రీస్తు జననం మానవ జాతికి మహోదయం ||2||
జయ జయ గీతం పాడండి కరములు మోడ్చివేడండి
లోకమేలే యేసుని కొలిచి శుభములు పొందండి llక్రీస్తుll
1 వ చరణం..
ఆకాశంలో తార వెలిగే ||2||
అవనిలో కాంతులు వెదజల్లే
ఆనందంతో యేసుని చేరి ఆరాదించండి ||2|| llక్రీస్తుll
2 వ చరణం..
పరమ దూత స్తుతిగీతములే ||2||
ప్రతిద్వనించగ భూలోకంలో
సదముల హృదయం సహృదయంతో సంస్తుతించండి ||2|| llక్రీస్తుll
3 వ చరణం..
తండ్రి ప్రేమకు సాక్ష్యం తానై ||2||
పశువుల పాకలో జన్మించె ` దివినె వీడి భువికరుదెంచిన
యేసుని వేడండి ||2|| llక్రీస్తుll
4 వ చరణం..
ప్రభు మనలను పూజించుటకై ||2||
ప్రభు సేవలను చేయుటకై
బాలయేసుని చెంత చేరి ` ధన్యులు కారండి ||2|| llక్రీస్తుll