Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపి క్రిస్మస్
క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
క్రీస్తు జయంతి మహోత్సవ పూజకు
త్వరపడి రారండి
ముద్దుల బాలుని ముదముతో
వేడగ వేగమే రారండి ||క్రిస్మస్||
1. గగనమందు ఒక తార,
దారి చూపగ వెలసింది
తూర్పు జ్ఞానులు పయనమైరి బాలుని చేరగ
బాలుని చేరెదం ప్రణతులు చేసెదం
దివి భువి అంతయు జయమని పాడెదం
హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్ ||హ్యా||
2. బెత్లహేము పురమందు
ఒక పశువుల పాకలో
పావనేసువు కన్యమరియకు
శిశువుగ పుట్టెను
శిశువును చేరరే శిరములు వంచరే
శ్రేష్ఠులన్ చేయుమని జేసుని వేడరే
హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్ ||హ్యా||