Type Here to Get Search Results !

కోయిలా పాడు ( koyila paadu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. కోయిలా పాడు వెన్నెలా పాడు 

సూర్య చంద్రులార

కూడిపాడి స్తుతించరారే

ఈ శుభరాత్రి దైవ కుమారుడు

జన్మించిన రాత్రి 

శాంతిని పంచే శాంతిధాముడు

ఇల వెలసిన రాత్రి 


1. ఆకాశంబున వెలుగుల యందు

దూతలుపాడిరి గ్లోరియా గీతం 

వినరారే జనమా గీతాలాపన

రారండి చూడగ రండి 

ఉల్లాస పాటలు పాడి యేసయ్య 

దీవెనలు పొందగ రారండి 

మంచును కురిసే రాత్రి ఇది 

నిజముగ పండుగ రాత్రి 

ఉత్సాహముతో పాడు ఇది

క్రిస్మస్ పండుగరాత్రి ||కో|| 


2. తూరుపు దిక్కున చుక్కను చూచి

ముగ్గురు రాజులు పయనించారు 

రారాజు చెంతను చేరి ఆరాధించిరి 

సంతోషం కురిసిన వేళ ఆనందం 

నిండిన వేళ రారండి 

జనమా యేసుని చూడగను

మంచును కురిసే రాత్రి 

ఇది నిజముగ పండుగ రాత్రి 

ఉత్సాహముతో పాడు 

ఇది క్రిస్మస్ పండుగ రాత్రి ||కో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section