Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
క్రిస్మస్ పాపకు హోసాన్న యనుచు -
క్రీస్తుకు పాటలు పాడుదము
1. కెన్నెర వీణుల రాగంబులు
గుడిగంటల గజ్జెల శబ్దంబులు
మహానందముతో ఉప్పొంగుచును మరి
గంతులు వేయుచు పాడుదమా
2. పరమున వీడిన ఆ బాలుడు
పశుశాలలో పుట్టెను ఈ రాత్రిలో
మరి వెళ్ళుదమా జోల పాడుదుమా
మన ప్రభుతో కూడి ఆడుదమా
3. గొల్లలు జ్ఞానులు ఏతెంచిరి భక్తిన్
బంగారు భోళము లర్పించిరి
మరి వెళ్ళుదమా జోల పాడుదమా
మన ప్రభుతో కూడి ఆడుదమా