Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏ నీడలేని ఈ లోకంలో `
ఏ తోడులేని నా జీవితంలో
నీ నామమే క్రీస్తు నా గానము
నీవే నా ప్రాణము నీవె నా గానము llఏ నీll
1 వ చరణం..
దివిలోన దూతాళి కొలిచేటి వేళ
భువిలోన ప్రజావళి స్తుతియించువేళ
నా మదిలో నా గదిలో ఒంటరివై `
చల్లని నీ నీడలో పవళించనీ ||2||
కనరావా నా దేవా దయగనవా ఈ దీనునిపై llఏ నీll
2 వ చరణం..
మతిలేక నీదారి తొలగినానులే ` గతిలేక ఏ దారి వెదకినానులే ||2||
నీ చూపు నాపైన ప్రసరించనీ ||2||
చల్లని నీ నీడలో పవళించనీ ||2||
వినరావా నాదేవా దయగనవా ` ఈ దీన మనసును llఏ నీll