Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ఎదలోపలి ఎదలో నివాసివై -
మది నిండిన మమతా మూర్తివై
అందరిని ఆదరించు స్వామీ! -
నా దురితముల రూపు మాపవేమి!
1. నిండు ప్రేమతో నన్ను పిలిచి యుండగ -
నీదు రాజ్యపు వారసత్వ మీయగ
స్వార్థ బుద్దితో వ్యర్థ జీవినైతిని -
అర్థ రహిత ఆశలందు నేను చిక్కితి ||ఎద||
2. కంటి పాపను కంటి రెప్ప కాయదా -
పూల రెమ్మను పూల కొమ్మ మోయదా!
కన్న బిడ్డను కన్న తల్లి మరచునా! -
నిన్ను చేరి శరణు కోర కరుణ జూపవా ||ఎద||