Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-16
ప. ఈ చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా
నీలోని విశ్వాసం కోల్పోకుండా ||2||
యేసయ్యా యేసయ్యాని నిన్నే పిలుస్తున్నా
నీ చెవియొగ్గి నామొరను ఆలకించుమా ||2||
కో. అల్లెలూయా....అల్లెలూయా....
ఆ.అల్లెలూయా.. ||2||
1. నాతల్లి దండ్రులు నన్ను వదిలిపెట్టిన ||2||
నీవునన్ను మరువనని వాగ్దానమిచ్చితివి ||2||
నాలో జరుగుతున్న కార్యములన్నీ
నాకే అర్థం కాలేదే నా యేసయ్యా ||2||
మార్గమా నా సత్యమా
నీదు జీవం పొందువరం-నాకు ఒసగుమా ||2||
2 నాలోని తలపులు తెలుసుకో యేసయ్యా ||2||
నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా ||2||
నీకు ప్రియంలేని కార్యములను తొలగించి ||2||
జీవమిచ్చుమార్గములో నన్ను నడుపుమా||2||
జీవమా నా మార్గమా ||2||
నిన్ను వెంబడి కృప నాకు ఒసగుమా ||2|| ||ఈ||