Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఈ దీనుని దయగనవా ఓ దయానిధి -
ఈ పాపిని కృపచూడవా ఓ కృపాంబుధి
1. కల్లలాడ వేరువలేదు సంపాదనకై -
చిల్లి గవ్వ విడువలేదు పేదలకై
ఈ లోభిని దయగనవా ఓ దయానిధి -
ఈ పాపిని కృపచూడవ ఓ కృపాంబుధి
2. కండ కావరమున కనిన వారినందరిన్ -
కొట్టితి తిట్టితి చిత్ర హింస పెట్టితి
ఈ క్రూరిని దయగనవా ఓ దయానిధి -
ఈ పాపిని కృపచూడవ ఓ కృపాంబుధి
3. కామాంధుడవై కాలమెల్ల గడిపితి -
కాముని సేవకై జవసత్వములు వీడితి
ఈ అంధుని దయగనవా ఓ దయానిధి -
ఈ పాపిని కృపచూడవా ఓ కృపాంబుధి