Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి : దయగల నా యేసయ్యా దయతో మన్నించుమా
పాపిని దోషిని కృపతో నన్ను క్షమియించుమా -
నీ కృపతో నన్ను క్షమియించుమా
ప : ఈపాప భారం నే మోయలేను-
ఈ బ్రతుకు గమ్యం నే చేరలేను
దయగల నా యేసయ్యా ఈ భారం తొలగించవా
కృపగల నా దైవమా నను నీదు దరిచేర్చుమా
1. నీ బిడ్డగా నన్ను పిలిచావయా-
నీ రూపులో నన్ను మలిచావయా
లోపాల లోతులో నేనుంటిని-
శాపాల బ్రతుకును నే కంటిని
2. నీ ప్రేమనే నేను పొందానయా-
నీ జీవమే నాకు ఒసగావయా
పాపపు కూపంలో పడిపోతిని-
ఈ లోక వాంఛలకు బలియైతిని