Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: అమృత వర్షిణి
ప: ఈ పాపి బ్రతుకులో ఎన్నెన్ని అతుకులో ||2||
చెప్పుకోటానికే సిగ్గు చేటులే ||2|| ||ఈ||
1. దారి తెలియనీ సమయంలో
చేయిపట్టి నడిపించావు ||2||
బ్రతుకే భారమైన వేళలో
నా పాప భారం తొలగించావు ||2||
నిను వీడిపోయాను నా దైవమా
నీ దరికి చేర్చి ఆదరించుమా ||2|| ||ఈ||
2. మాట తప్పి మసలినానూ
నీతి మాలి బ్రతికినాను ||2||
పొరుగువాని మేలు మరచి
స్వార్ధంతో జీవించానూ ||2||
నీ దీనమనస్సు నాకొసగుమా
నీ బాటలో నడిపించుమా ||2|| ||ఈ||