Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1. ఈ దివ్య సత్ప్రసాద మందును
అదృశ్యమైన యేసు దేహము
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం లోకమందు యేసు మీకు
సత్ప్రసాదంలో ప్రాకటంబు స్తోత్రము
2. అత్యంత సారమైన భోజ్యమా -
నిత్యంబుగా నుతింతు కోర్కెతో
3. సమస్తలోక మానవాళికి
అమృతమైన జ్ఞాన భోజ్యమా
4. సంపూర్ణ తృప్తి నిచ్చు నప్పమా -
సంపూజనీయమౌ నైవేద్యమా ||స్తోత్రం||
5.అవని పాపముల్ క్షమించెడి -
పవిత్ర గొర్రెపిల్ల యేసువు
6. దురాశలన్ తప్పించు ఔషధం -
మొరాలకించు యేసు దేహము