Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని -
నా ఆశ తీర అర్పింతును
నా ఆత్మనాధా! కరుణించు నన్ను -
నా చిన్న కాన్కను గ్రహియింపవా
1. ఏ ఆశలేని నా పేద హృదిని -
సృజియించగా అది వికసించెను - ||2||
ఆ నవ్య హృదిని నా ప్రేమ నిధిని -
నీ దివ్య హస్తాల అర్పింతును ||ఈ జీవ||
2. ఏనాటిదోయి ఈ రాగబంధం -
విడిపోనిది ఈ అనుబంధము - ||2||
ఈ అప్పద్రాక్ష జలరాశిలోన -
నీ ప్రేమ స్వర్గాన్ని కనుగొందును ||ఈ జీవ||