Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. ఈ జీవితం నీ స్వంతము
నా హృదయమే నీ కర్పితం
ఏనాటి బంధం నీ స్నేహం
నిలవాలి జీవితాంతం
నీ మహిమ కోసమే
ఈ కానుక, చిరుకానుక ||ఈ||
1. నీ మంచితనమే నా భాగ్యము
నీ జాలిగుణమే సౌభాగ్యము
నీ దివ్య నామమందే
నవ జీవ సిరులు వెలయు
నీ నిత్య ప్రేమలోనే జీవింతును
ఫలియింతును ||ఈ||
2. నా జీవితాశ నీ సన్నిధి
నా భావనలలో ఆనందము
తపియించు మనసు నీకై
అనురాగ దివ్య హృదయా
ఆరాధ్యదైవమా అర్పింతును
ఫలియింతును ||ఈ||