Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఈ శుభవేళ ఈ పూజ వేళ -
సంతస మొందేవేళ మనసులు పొంగే వేళ
1. ప్రియమార మమ్ముల పిలిచావు స్వామి
ముదమార మమ్ముల మలిచావు స్వామి
నీ పలుకే మమ్ము నడిపించలేదా
నీ కరుణలో మేము తరియించ లేదా ||ఈ||
2. సుఖ సంపదలతో నింపావు స్వామి
కలిమి లేములను కూర్చావు స్వామి
కాపరివై మమ్ము కరుణించలేవా
మేపరివై మమ్ము నడిపింపరావా ||ఈ||
3. ఆత్మల ప్రక్షాళనం మా భాగ్యం మా భాగ్యం-
ప్రేమైక జీవనం మా ధ్యేయం
మా ధ్యేయం సామాజిక సేవయే మా ఆశయం మా ఆశయం
విశ్వాస వికాసమే మా రక్షణ - మా రక్షణం