Lyrics/Tune: Joseph Konda
Music: Christopher JK
Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 1
ప. ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతియించెదను
ఏ స్థలమందైన నిన్ను సేవించెదను
నీకే నా ఆరాధన-యేసు
నీకే నా ఆరాధన ||2|| ||ఏ||
1. అనాధగా నన్ను విడువనంటివి
ఆధరణ కర్తను ఒసగి యుంటివి ||2||
నేను జీవించుచున్నాను కనుక ||2||
మీరు జీవింతురని వాగ్దాన మిచ్చితివి ||2||
నీకే నా ఆరాధన-యేసు
నీకే నా ఆరాధన ||2|| ||ఏ||
2. తల్లి నన్ను మరచిన మరువనంటివి
నా పేరు నీ చేతిలో రాసుకుంటివి ||2||
నేను లోకమును జయించితిని కనుక ||2||
మీరు ధైర్యముగాను జీవించమంటివి ||2||
నీకే నా ఆరాధన-యేసు
నీకే నా ఆరాధన ||2|| ||ఏ||