Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏలినవారా దయచూపండి - క్రీస్తువాదయ చూపండి ||2||
ఏలినవారా దయచూపండి-దయచూపండి-దయచూపండి ||2||
దివిలో దేవునికి మహిమ - అని పాడండి దూతలపాట ||2||
భువిలో ప్రజలకు శాంతి - అని పాడండి ఆనందముగా
మహిమ మహిమ మహిమ - పాడెదము మహిమ ||2||
1 వ చరణం..
ప్రభుదేవా నిన్ను ఆరాధిస్తాము - పరలోకరాజా నిన్ను స్తుతియిస్తాము ||2||
చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో - మహిమ ప్రతాప నీకే మహిమ ||2|| llమహిమll
2 వ చరణం..
యేసుక్రీస్తా పరిశుద్ధ ప్రభువా - దివ్యగొఱ్ఱెపిల్లా మా రక్షణ నీవే ||2||
దైవకుమారా మహోన్నతుడా - మహిమప్రతాప నీకే మహిమ ||2||
3 వ చరణం..
పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాము - ప్రేమ స్వరూప నిన్ను స్తుతియిస్తాము ||2||
త్రియేక దేవా కృతజ్ఞతలివిగో - మహిమ ప్రతాపనీకే మహిమ ||2|| llమహిమll