Type Here to Get Search Results !

ఎందుకు స్వామి నన్ను ( endhuku Swami nannu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: ఎందుకు స్వామి నన్ను నీవు 

ఎంచుకొంటివి అల్పుడనైన నన్ను 

నీ చేతులలో దాచుకొంటివి ||2|| 

నీ కన్నులలో పాపగా నన్ను 

మలచుకొంటివి ఊపిరిలో 

నీ ఊపిరిగా నన్ను నిలుపుకొంటివి

నన్ను నిలుపు కొంటివి ||ఎ|| 


1. పనికి రాని మట్టిని నేను

పసిడి బొమ్మగా చేసినావు ||2|| 

ఏమిరాని వెదురును రాగమయం 

చేసినావు గడ్డిపువ్వునైన నన్ను 

సువాసనతో నింపినావు 

అంతులేని ప్రేమతో నన్ను

నీ సొంతం చేసినావు


2. రాతిశిలకు ప్రేమ మీర 

రంగులెన్నోవేసినావు 

నీ చేతులతో నన్ను తాకి 

వెన్నముద్దగ చేసినావు ||2|| 

గాలిలోన దాగియున్న ధూళినయ్యా 

నేను స్వామి ఎందుకయ్యా 

నీ యెదపై ముదమార 

నన్ను నిలుపుకొంటివి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section