Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి: గలిలయ మహాపురుషుండు అరుగో
ఆ....ఆ.....ఆ.....ఆ....ఆ
మన మధ్యకే వచ్చియున్నారు ఆ....ఆ...
మనతోనే వాసము చేయుదురు.
ప. అరుగో గలిలయ మహా పురుషుండు
నాకేన్నో ఘనకార్యముల్ చేసెను అల్లెలూయ
ఆయన కిదే నా హృదయ గానము
దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసార
ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను
1. నాకై వచ్చెను అ... అ...
తన మనసిచ్చెను అ... అ...
ప్రాణము నిచ్చెను - జీవము పోసేను
ఉత్థానుడయ్యెను - నాతో నిలువను ||2|| ||ఆ||
2. ప్రభువై వెలసెను అ... అ...
మనసును కోరెను అ... అ...
ప్రేమతో నింపెను ప్రతి ప్రేమను కోరెను
సోదర ప్రేమను - శాసన మొసగెను ||2|| ||ఆ||
3. పరమ ప్రసాదము అ... అ...
మధురాహారం అ... అ... ||2||
పాపుల రక్షణకు - ప్రభుని ప్రసాదం||2||
ఒసగెను తండ్రి - మనరక్షణకై ||2|| ||ఆ||