Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం - 15
ప: గాలిలో రెపరెపలాడుచున్న చిరుదీపము
నేను నీ రెక్కలతో కప్పుము నన్ను ||2||
నా యేసు కప్పుము నన్ను
యేసు...యేసు...యేసు...యేసు...
1. పాపము నన్ను వెంటాడుచుండ
నీ పరిశుద్ద వస్త్రముతో కప్పుము నన్ను||2||
కోపం క్రోధం నను చుట్టినా
నీ ప్రశాంత మనస్సును ఒసగుమయ్యా ||2||
యేసు...యేసు...యేసు...యేసు...
2. బలహీనములో పడిపోవుచుండ
నీ కృపవస్త్రముతో కప్పుచు నన్ను ||2||
భయము భీతి నన్ను చుట్టినా
నీదైర్యమిచ్చి బలపరచు
యేసు...యేసు...యేసు...యేసు...