Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప:. గుడిలో గంటల నాదాలు
పూజకు పలికే ఆహ్వానాలు
మదిలో మెదిలే భావాలు
పాడే ప్రభుని రాగాలు
1. గుడి తలుపులు తెరిచిరి మనకొరకు
హృదితలుపులు తెరవాలి మనము ||2||
మలినం లేని మనస్సులతో
మాటల మల్లెల మాలలతో
అరుదెంచెదము అమరుని చెంతకు
ఆరాధనకు ఈ వేళ ||2|| ||గుll
2. ప్రభు సేవకు సమయం అందరికి
ప్రతి మనస్సున వెలగాలి ప్రభు వెలుగు ||2||
తేనెల తేటల మాటలతో
తుమ్మెదలంటని పువ్వులతో
అరుదెంచెదము అమరుని చెంతకు
ఆరాధనకు ఈ వేళ ||2|| ||గు||