Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గుడి గంటలు పిలుచుచున్నవి ప్రభు పూజకు వేళయిందని
పరవశ హృదయముతో పరుగున వెళ్ళెదము
పరమ ప్రభుని పూజించుటకు నవ్యతతో జీవించుటకు
1. దేవుడే మానవుడై అవతరించినాడు -
మనుజుల కొరకై తాను మహిమ వీడినాడు
వాగ్దాన ఫలములను మనకు యిచ్చినాడు
వారసులుగా మనలను తాను చేసినాడు
స్తుతి యాగముతో భక్తి కీర్తనతో -
వాక్య పఠనముతో ధూప దీపముతో
దివ్య పూజలో పాల్గొందము -
నవ్య హృదయముతో జీవింతుము ||స్తుతియా||
2. మట్టితో మనిషిని తాను చేసినాడు -
మహిమగల పాత్రగా వాడుచున్నాడు
స్నేహితులని మనలను పిలుచుచున్నాడు
పరలోక రాజ్యమునకు దారి చూపుతాడు ||స్తుతియా||