Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: గుడిగంటల' సుమనోహర
మంజులనాదం ఆత్మ విభుని
సన్నిధికి అనురాగ ఆహ్వానం ||2||
పరవశాన తరలిరారే
ప్రియ క్రీస్తు సంఘమా ||2||
పరమ ప్రభుని పూజ చేయ
ముదముతో రారే ||2||
రారే దైవజనమా
బలిపీఠ సన్నిధికి రారే
రారే దైవజనమా-దైవవరములొందగా...
దీవెనలు పొందగా ||గుడి||
1. ఇది ప్రభుని ప్రేమ పిలుపు
పరమార్థమేలుకొలుపు
జీవితాన మలుపు
ప్రియమార బదులు పలుకు ||2||
తన సేవకు నిను రమ్మని పరమ
ప్రభువే పిలువగా ||2||
ఇలవేల్పుని కొలువు చేర
నీ సమ్మతి తెలుపవా ||2||
రారే దైవజనమా-దైవవరములొందగా...
దీవెనలు పొందగా ||గుడి||
2. ఇది మరులు గొలుపు పిలుపు
మధురామృతాల చినుకు
వెండి పూల వెలుగు
వెన్నెలలు చిలుకు బ్రతుకు ||2||
తన్మయాన ప్రభుని చేర
మహిమ స్తుతులు తెలుపవా ||2||
చరితార్ధుడవై ఇలలో దీవెనలే పొందగా ||2||
||రారే దైవజనమా-దైవవరములొందగా...
దీవెనలు పొందగా ||గుడి||