Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. గీతం గీతం జయజయ గీతం
చేయి తట్టి పాడెదము
యేసు రాజు లేచెను అల్లేలూయ
జయమార్భటించెదము
1. చూడు సమాధిని మూసినరాయి
దొరలింప బడెను
అందువేసిన ముద్ర కావలి నిలచెను
దైవసుతుని ముందు ||గీ||
2. వలదు వలదు ఏడువ వలదు
వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడీ ||గీ||
3. అన్నకయప వారల సభయు
అదురుచు పరుగిడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి ||గీ||
4. గుమ్మముల్ తెరచి చక్కగ
నడువుడి-జయవీరుడురాగా
మా మేళ తాళ వాయిద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడీ ||గీ||