Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప ఘనమైన నీ దివ్య సందేశ వాక్యం..
పులకింప చేసే తనువెల్ల దేవా
మనస్సులో చల్లెలే కుసుమాల సౌరభం
ప్రేమయే నన్నింతగా పిలచేలే నీ చెంత
1. బీట వారిన ఎదనేల పైన
వాన జల్లులే దివ్యమైన వాక్కులు ||2||
అడుగంటిన ఆశలన్ని చిగురించి మొగ్గలేసి
నీదు ప్రేమయే విరజిల్లెను దైవ తేజము
2. మధుర ధారలు ప్రభుని మాటలు
కాంతి పుంజము కటాక్ష వీక్షణం ||2||
హల్లె... హల్లె... హల్లె...
మనస్సు నిండేలే మధుర వాక్కు
లాలింపగనే ||2||