Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గ్లోరియా గ్లోరియా గ్లోరియా
గ్లోరియా గ్లోరియా గ్గ్లోరియా
మహోన్నతమున సర్వేశ్వరునికి
మహిమ కలుగునుగాక {ఘన}
భూలోకవాసులకు శాంతిసమాధానం
కలుగునుగాక ఇల కలుగునుగాక
1 వ చరణం..
ఏలినవారైన సర్వేశ్వరా పరలోకరాజా
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా
మిమ్ము పొగడుచున్నాము
స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము
మిమ్ము ఘణపరచుచున్నాము
మీ దయనే ఇలలో కోరెదము
2 వ చరణం..
జనితైకసుతుడా ఏలినవారా పితప్రియసుతుడా
సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రెపిల్లా
మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము
ఆరాధించుచున్నాము
లోకపాపములన్ హరించుటకై
భువిలో వెలసిన మా ప్రభువా
3 వ చరణం..
పితకుడిప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా
మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా
మిమ్ము పొగడుచున్నాము
స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము
మీ ఘణమును గూర్చిచాటెదము
మీ దయనే ఇలలో కోరెదము
4 వ చరణం..
మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధదేవా
మహోన్నతులు మాపావన శ్రీయేసువా
మిమ్ము పొగడుచున్నాము ఆ ఆ ఆ
స్తుతించుచున్నాము ఆ ఆ ఆ
ఆరాధించుచున్నాము
పితయైన సర్వేశ్వరుని మహిమలో
పవిత్రాత్మతో నుండువారా
ఆ ఆ ఆ ఆ ఆమెన్