Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గ్లోరియా గ్లోరియా
మహిమ మహిమ మహోన్నతమున
మనదేవునికి మహిమ
మహిమగీతం పాడెదము ఘనదేవునికి
భువిలో ప్రజలకు శాంతిని ఇచ్చును
దివి మహరాజును ఆరాధించి
స్తుతియించెదము మన ప్రభు నామం (మహిమ)
1 వ చరణం..
దైవసుతుడు ప్రభుక్రీస్తుకు పాడెదము
ప్రభుయేసే దివ్య గొర్రెపిల్ల 2
పాపాలను మోసిన ప్రభువా
ప్రార్ధన వినుమా దయచూపుమా (మహిమ)
2 వ చరణం..
ముక్తిదాత ప్రభుక్రీస్తుకు పాడెదము
తండ్రికి కుడిప్రక్క కూర్చున్న ఓ ప్రభువా
పరిశుద్దుడవు నీవే ప్రభువా
ప్రార్ధన వినుమా దయచూపుమా మహిమ
తండ్రిదేవునికి మహిమ ఆయనసుతునికి మహిమ
పావనాత్మకు మహిమ త్రియేకదేవునికి మహిమ
మహిమ మహిమ మహిమ మహిమ
ఆమెన్ ఆమెన్ ఆమెన్