Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గ్లోరియా గ్లోరియా గ్లోరియా ఇన్ ఎక్సల్సస్ దేయో
మహోన్నతమున పరమదేవునికి మహిమ
భూలోక ప్రజలకు శాంతి సమాధానము
ఏలినవారైన సర్వేశ్వరా పరలోక మా తండ్రీ
సర్వశక్తిగల దేవా పితయైన మా ప్రభువా
మిమ్ము ఘనపరచెదం మిమ్ము స్తుతియించెదం
మిమ్ముపొగడెదము మిమ్మారాధించెదం
జనితైకసుతుడా ఓ యేసా ఈ లోకరక్షకుడా
లోకపాపపరిహారకుడా దేవుని గొర్రెపిల్లా
మిమ్ముఘనపరచెదం మిమ్ముస్తుతియించెదం
మిమ్ముపొగడెదము మిమ్మారాధించెదం
మీరొక్కరే పరిశుద్ధులు ఓ మహోన్నతుడా
పితదేవసుతుడా మాక్రీస్తువా పవిత్రాత్మసర్వేశ్వరా
మిమ్ముఘనపరచెదం మిమ్ముస్తుతియించెదం
మిమ్ముపొగడెదము మిమ్మారాధించెదం