Type Here to Get Search Results !

గ్లోరియా ఇన్ ఎక్సల్సస్ దేయో ( glowriya in exalses dheyo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా గ్లోరియా గ్లోరియా ఇన్ ఎక్సల్సస్ దేయో

మహోన్నతమున పరమదేవునికి మహిమ

భూలోక ప్రజలకు శాంతి సమాధానము 


ఏలినవారైన సర్వేశ్వరా పరలోక మా తండ్రీ

సర్వశక్తిగల దేవా పితయైన మా ప్రభువా

మిమ్ము ఘనపరచెదం మిమ్ము స్తుతియించెదం

మిమ్ముపొగడెదము మిమ్మారాధించెదం


జనితైకసుతుడా ఓ యేసా ఈ లోకరక్షకుడా 

లోకపాపపరిహారకుడా దేవుని గొర్రెపిల్లా 

మిమ్ముఘనపరచెదం మిమ్ముస్తుతియించెదం 

మిమ్ముపొగడెదము మిమ్మారాధించెదం


మీరొక్కరే పరిశుద్ధులు ఓ మహోన్నతుడా

పితదేవసుతుడా మాక్రీస్తువా పవిత్రాత్మసర్వేశ్వరా

మిమ్ముఘనపరచెదం మిమ్ముస్తుతియించెదం

మిమ్ముపొగడెదము మిమ్మారాధించెదం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section