Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 3
గోధుమప్ప రూపం- గాయపడిన దేహం
ద్రాక్షారస పానం- చిందిన నీ రుధిరం
స్వీకరింతుము- నిండు మనసుతో
అణువణువున- పదిలపరతుము
1 వ చరణం..
నిన్ను నీవు విరిచి- పంచినావులే
మిన్న యైన బ్రతుకు- ఇచ్చినావు లే
అన్ని వేళలా- అన్ని చోట లా
ప్రస్తుతింతు ను- నీదు త్యాగము
2వ చరణం..
మా జీవితాలు- మెరుగు పరచుము
సేవ చేయు మనసు- కలుగజేయుము
స్వార్ధం మరచి- ప్రేమను పంచి
సమతను పెంచ- దీవించు మా
3వ చరణం..
ఎంచలేని మనసు- ఇవ్వాలి మాకు
పంచుకునే బుద్ధి- నేర్పాలి బలిలో
ఏ జామునా- ఏ రోజునా
నీకోసమే- జీవించెదం