Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసు నామం
ప. గుణదల గుహలో గగనపు తారగ
వెలసిన మరియమ్మ ఇవిగో ప్రణతులు
చేకొమ్మ ఓ లూర్థుమాత ఓ గుణదల మాత
ఓ..లూర్థుమాత ఓ....గుణదలమాత ||2||
1. కానాపల్లెలో పెండ్లి విందుకు
వెళ్ళితి ఓయమ్మా కృప చూపుమని
తనయుని వేడిన ఓ మా మరియమ్మా
యేసుని ఆద్బుతం చూపించిన మాయమ్మా
క్రీస్తుని మహిమను
చాటించితి ఓ యమ్మా ||2|| ||ఓ||
2. ఫ్రాన్సునందలి లూర్థు నగరిలో
నీవేనోయమ్మా బెర్నదత్తకు
దర్శనమిచ్చిన ఓ మా మరియమ్మ ||2||
గుణదల కొండపై కనిపించుము
మాకమ్మా వరముల
మాతవై వర్ధిల్లుము ఓయమ్మా ||2||