Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. గొల్లోలమండి మేము గొల్లోల్లము
గొర్లగాచి బతుకుతాము గొప్పోళ్ళము
తందనానె తానె తందనానె... తందనానే...
1. కర్రచేతబట్టుకొని గొర్రెచంకనెత్తుకొని
సద్దిమూటకట్టుకొని చల్లనెత్తినెట్టుకొని
బెత్లెము పోతున్నాం బేగరండి పోదాము
గొల్లోల్లం...గొల్లోల్లం.. తందానానె... ||గొ||
2. ఆకాశంవైపు చూడు అదిగో వెలువోత్తుంది
అల్లదగో దేవదూత-ఈవైపే వస్తుంది
యేసురాజు బుట్టెనని వెళ్ళమని చెప్పుతుంది
గొంగళి పైకెత్తికో రా - తొంగోక బేగిరార
గొల్లోల్లం.గొల్లోల్లం.
తందానానే..తందానానే ||గొ||
3. బంగారు వన్నెగాడు బాలయేసు రాజు చూడు
బతుకు బాగుచేయమని బాలుణ్ణి వేడుదాము
గొట్టెలను కానుకగా గొప్పగాను యిద్దాము
ప్రజలందరు రండి రండి ప్రభుని వేడుకుందాము ||గొ||