Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
గొంతు సవరించి వీణ శృతి చేసి
పాడెద హల్లేలూయా..హల్లేలూయా ||2||
హల్లేలూయా పాడి ఆనంద
విభుని ప్రణుతింతు ఈ దినం
ప్రభుని ప్రణుతింతు నిరతము
హల్లేలూయా.. హల్లేలూయా.. ||6||
1. యేసు వాక్యమే నాకు దీపమై
సాగిపోదు ఇల సువార్తలో ||2||
యేసు ప్రేమనే నా హృదిలో ||2||
నింపి పయనింతు ఈ భువిలో
హల్లేలూయా.. హల్లేలూయా.. ||6|| ||గొంతు||
2. మధురమైనదీ యేసునామము
పాడి స్తుతింతును ఈ భువిలో ||2||
దివ్యరక్షకుని పాద సన్నిధిలో
నిలిచి ఉందును ఈ ధరలో
హల్లేలూయా.. హల్లేలూయా.. ||6|| ||గొంతు||