Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ఆరని ప్రేమ
ప ఇదే ఇదే జీవాహారం
ప్రేమ తనయుని మధురాహారం ||2||
ఆత్మను తడిపే అమృత పానం
మధురం ఇది అతి మధురం .
1. అధికుడు అల్పుడు తేడా లేదు
అందరూ అర్హులే అమర విందుకు ||2||
ఆత్మ శుద్ది ఉంటే చాలును.
ఐక్యం చేయును దివ్య విందు ||2|| ||ఇ||
2. అలసిన మనసుకు హాయినిచ్చును
సొలసిన తనువును సేద తీర్చును ||2||
జీవమునిచ్చెడి సంజీవని
పాపులకిది పరమౌషధం ||2|| ||ఇ||