Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: మార్గం సత్యం జీవం-1
ప. ఇదే ఇదే ప్రభు నివేదన
ఇదే ఇదే ప్రభు ప్రార్థన
ఎన్నటికి దప్పిక గొనని
జీవ జలము కావాలి
కో. ఆత్మతో నిన్ను ఆరాధించే
ఆత్మ బలము కావాలి
1. ఎంతగ నీటిని త్రాగిన గానీ
తీరదు పెదవుల దప్పిక
దాహము తీర్చగ జలములపైన
లేదిక ఎదలో నమ్మిక
కొత్త జీవితం కోసం
సరికొత్త ప్రపంచం కోసం ||4|| ||ఇ||
2. చిత్తములోన సిద్దపడితిని
నేనొక సమరయ స్త్రీనై
చాటెద నీదుసువార్త నంతట నేనే
నీకొక సాక్షినె నిత్య నూతనం కాగా
ఎద విజయ కీర్తనం కాగా ||4|| ||ఇ||