Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సుస్వరాలు
ప ఇదే ఇదే మన ప్రభుని విందు
ఇదే ఇదే మన ప్రేమ విందు
ఇదే ఇదే మన స్వర్గ విందు
లోకాన రారండి దైవజనమా
లోకాన రారండి లోకాన రారండి
దైవజనమా లోకాన రారండి
1. ఆది దేవుని అమృతవిందు
ఆత్మ దాహము తీర్చెడి విందు
ఆత్మ తృప్తిని ఒసగెడి విందు
మానవాళికి రక్షణ విందు
2. స్వర్గము నుండి దిగిన విందు
నీ హృది చేరిన దైవ విందు
సర్వ జననాళికి రక్షణ విందు
స్వర్గవాసము చేర్చెడి విందు