Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇదే ప్రభు దేహం ` ఇదే ప్రభు రక్తం
లోకొనరే జనులారా ` నిత్య జీవాహారం
1 వ చరణం..
మనలనెల్ల తనతో చేర్చి ఈ భువికేతెంచెనే
శిలువనే మోసి శ్రమకోర్చి మరణం జయించెనే
దైవ ప్రేమ సోదర ప్రేమ మనలో రగిలింపా
వేగరారే దేవరవారి యీ దివ్య విందునకు llఇదేll
2 వ చరణం..
సకల జనుల సృష్టికర్త సత్యస్వరూపుడు
మానవకోటి మలినం బాప యీ భువి కేతెంచెనే
రండి జనులారా రండి వేగమే ఈ విందు ఆరగింపా
ప్రేమమయుడు జీవమిచ్చిన ఈ దివ్య విందునకు llఇదేll