Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇదియే జీవాహారం - ఇదే క్రీస్తు దేహం
ఇదియే జీవన పానం - ఇదే క్రీస్తు రక్తం
లోకొనరారే ప్రేమామయుని పరలోక ఈ విందు
ఆరగించరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు
ప్రభుని బలి విందు క్రీస్తు ప్రభుని ప్రేమ విందు
1. మన్నా భోజన విందు మన్నన లేని విందు
మన్నన కలిగే విందు ప్రభుని ప్రేమ బలి విందు ||2||
కాళ్ళు కడిగిన విందు కరుణామయుని విందు ||2||
భువిని బ్రోచిన విందు దివిని చేర్చే విందు ||2|| ||లోకొన||
2. నీటిని రసముగ మార్చిన తొలి అద్భుతమైన విందు
జలములపై నడిచిన సజీవుని క్రీస్తుని విందు ||2||
నరుని బ్రోచిన విందు నడతనిచ్చిన విందు ||2||
లోకులు చేయనివిందు లోకాధిపతిని విందు ||2|| ||లోకొన||