Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇదే ఇదే మా విశ్వాసము 3
సర్వ జగంబుల సృష్టి నిర్మాతవు
సర్వశక్తుడు పితయగు దేవుడు. ll 2 ll
పితయైన పుత్రుడు పరమేశ్వరుడు
జగన్నాధుడు యేసుక్రీస్తు. llఇదేll
పరిశుద్ధాత్మ ప్రసాద వరము
మేరి కన్యక గర్భ ఫలము ll 2 ll
క్రీస్తుజననమే రక్షణ మార్గం
మానవ జాతికి మహోదయం llఇదేll
ఫోన్సు పిలాతుని అధికారములో
యేసుప్రభు బాధపడి స్లీవ మీద
కొట్టబడి మరణం పొంది ఘనమాయెను. llఇదేll
మరణం పొంది మూడవ నాడు
మృత్యుంజయుడై మరల లేచెను. ll 2 ll
సర్వధాముడై పిత కుడి ప్రక్కన
సింహాసనమును అలంకరించెను. llఇదేll
మహిమతో మన ప్రభు మరల వచ్చును
మానవ జాతికి తీర్పు తీర్చును ll 2 ll
పరిశుద్ధాత్మ పవిత్ర శ్రీ సభ
పునీత వారల సంబంధ కలిమి. ll 2 ll
పాపక్షమాపణ పునరుత్థానం
పరలోక భాగ్యమే - మా సౌభాగ్యం. ll ఇదేll
ఆ......ఆ......ఆ......ఆమెన్...... ll 2 ll