Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా॥సకల సృష్టి స్థితి లయ కారకా..
మా జీవిత పయనానికి మూలాధారమా
నీ సేవకై మమ్ముఅభిషేకించిన మా దేవా
అందుకోమా కృతజ్ఞతాంజలి...
ఇదే మా కృతజ్ఞతాంజలి
ప॥ ఇదే ఇదే స్వాగత గీతం... స్వాగతం
స్వాగతం సుస్వాగతం
ఇదే ఇదే జూబిలిగీతం
స్వర్ణోత్సవ వేడుకలకు శుభస్వాగతం
ఇదే ఇదే స్వాగత గీతం
ఇదే ఇదే జూబిలిగీతం
జీవిత సర్వేశ్వరా మా జీవన ఆధారమా
జీవిత సర్వేశ్వరా జీవన ఆధారమా
ముకుళిత హస్తాలతో పరిమళ పుష్పాలతో
సుమధుర గీతాలతో ఈ పూజకు స్వాగతం
స్వాగతం సుస్వాగతం ||2||
1. మట్టిని మనిషిగ మలిచావు -
ఆ మనిషికి ఊపిరిని పోసావు ||2||
ని దివ్య హస్తమును మాపైన చాపి ||2||
అసమానులుగా మమ్ము చేసావు
అపురూప సృష్టిగ మలిచావు
స్వాగతం సుస్వాగతం ||2||
||ఇదే||
2. ప్రేమతో పేరు పెట్టి పిలిచావు -
నీ సన్నిధికి మమ్ము చేర్చావు ||2||
నీ దివ్య సన్నిధిలో నిత్యం నివసించగా ||2||
అభిషేక వరములతో నింపావు -
శతాధిక వసంతాలు దీవించావు
స్వాగతం సుస్వాగతం ||2||
||ఇదే||