Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప|| ఇదే... క్రీస్తు మందిరం
ఇదే హృదయనందనం ||2||
ఈ ప్రేమ మందిరాన
కలిసుందామందరం ||2||
కలిసుందామందరం ||ఇదే||
1. ఆశయాలకిది మార్గం
ఆనందానికి స్వర్గం ||2||
ఆశించినవారికెల్ల
ఇది మహదాశ్రయదుర్గం ||2|| ||ఇదే||
2. కోపాలకు తాపాలకు
తావులేని నందనం ||2||
కాపాడే ప్రభుని చెంత
చేరిన అభినందనం ||2|| ||ఇదే||
3. సమభావన సహజీవన
సిద్దాంతాలకు నిలయం ||2||
సమతా మానవతా ధరకు
మహనీయుని ఆలయం ||2|| ||ఇదే||