Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. ఇది అర్పణ సమయం ||2||
సర్వేశ్వరుని అర్చన సమయం ||2||
ఇది అర్పణ సమయం
వినమ్రమయిన హృదయం
తెరచి అర్పించేము
మా కానుకలు మిమ్ము
అర్పించెదము ఎద కోవెలలో ||ఇ||
1. ఆబేలు అర్చన దీవించావు
ఆరోను బలిని స్వీకరించావు . ||2||
మా మనసులను విరిమాల చేసి
నీ పద సన్నిధి అర్పిస్తున్నా
దీవించు స్వామి మా నైవేద్యములు
స్తుతి స్తోత్రములు సర్వాంతర్యామి ||ఇ||
2. గోధుమ అప్పము ఇదిగో దేవా
నీ దేహముగ మారుమూ ప్రభువా -||2||
ఇదిగో దేవా ద్రాక్షారసము
నీ రుధిరముగా రూపొందించు
ఈ జీవితమే కర్పూర కళికై
కరిగిపోవాలి నీ పద సేవలో ||ఇ||