Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ష ఇది ఆత్మీయ విందు ప్రభుయేసుని విందు
ఇది పరలోక విందు - పరిశుద్దతో పొందు ||2||
ఆమెన్ అనుచు నీవు
శిరమును వంచి స్వీకరించుము ||2|| ||ఇ||
1 పాపము బాపును ఈ విందు
పరిశుద్దత నిచ్చును ఈ విందు
శాంతిని ఒసగును ఈ విందు
ఐక్యత పెంచును ఈ విందు ||2||
సమాధానమిచ్చును ఈ విందు
సహనంనేర్పును ఈ విందు . ||ఆమె||
2 రక్షణనిచ్చును ఈ విందు
పరమున చేర్చును ఈ విందు ||2||
ప్రేమను పెంచును ఈ విందు
సంతోషమిచ్చును ఈ విందు ||2||
సకలమునిచ్చును ఈ విందు
సత్యం తెలుపును ఈవిందు ||ఆమె|| ||ఇ||